Nayanatara : నయనతారకు మైత్రి మెగా ఆఫర్..!

Nayanatara ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస భారీ సినిమాలు చేస్తూ వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ పుష్ప 2, ఆర్సీ 16 సినిమాలను

Published By: HashtagU Telugu Desk
Nayanatara Love with Young Hero, Is It Worked Out Well

Nayanatara Love with Young Hero, Is It Worked Out Well

Nayanatara ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస భారీ సినిమాలు చేస్తూ వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ పుష్ప 2, ఆర్సీ 16 సినిమాలను నిర్మిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని చూస్తున్నారు. నయనతార లీడ్ రోల్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కథ ఏంటి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.

We’re now on WhatsApp : Click to Join

అయితే నయనతారతో పాన్ ఇండియా లెవెల్ లో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కథ ఫైనల్ అవ్వగా నయనతారకి ఫైనల్ వెర్షన్ వినిపించాలని చూస్తున్నారట. నయనతార ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తుందని తెలుస్తుంది.

ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు నయనతార అదరగొడుతుంది. నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు సైతం కంగారు పడేలా పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ ఇయర్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నయనతార హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మెగా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నయనతారకి మెగా ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా కోసం నయనతారకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Anandi : భర్త ప్రోత్సాహంతో ఆనంది అలాంటి పాత్ర చేసిందట..!

  Last Updated: 05 Jan 2024, 11:08 AM IST