Ilaiyaraaja : ఇళయ రాజాకు అవమానం.. గర్భగుడి నుంచి బయటకు పంపిన ఆలయ నిర్వాహకులు

దీంతో ఆలయం అర్థ మండపం మెట్ల దగ్గరే నిలబడి ఇళయరాజా(Ilaiyaraaja) పూజలు నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Music Maestro Ilaiyaraaja Srivilliputhur Aandal Temple Tamil Nadu

Ilaiyaraaja : ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజాకు అవమానం జరిగింది. మార్గశిర మాసం తొలిరోజు సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున తమిళనాడులోని విరుధు నగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ మాత ఆలయానికి ఇళయరాజా వెళ్లారు. ఆయన గర్భగుడిలోకి అడుగుపెట్టారు. అయితే ఆలయ నిర్వాహకులు ఓవర్ యాక్షన్ చేశారు. గర్భగుడి బయటికి వెళ్లాల్సిందిగా ఇళయ రాజాకు సూచించారు. అక్కడ ఉన్న జీయర్  కూడా ఆయనను అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో ఆలయం అర్థ మండపం మెట్ల దగ్గరే నిలబడి ఇళయరాజా(Ilaiyaraaja) పూజలు నిర్వహించారు. ‘దివ్య పాశురం’ పేరుతో తాను స్వరపర్చిన భక్తిగీతాలను విడుదల చేయనున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయానికి ఇళయరాజా వచ్చారని తెలిసింది.

Also Read :Telangana Debt : తెలంగాణ అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తారా.. ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం : కేటీఆర్

భగవాన్  విష్ణుమూర్తికి సంబంధించిన 108 పుణ్య క్షేత్రాల్లో శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ మాత ఆలయం ఒకటి. 7వ శతాబ్దం నాటి ప్రఖ్యాత తమిళ కవయిత్రి ఆండాల్‌తో ఈ ఆలయానికి అనుబంధం ఉంది. మార్గశిర మాసం తొలిరోజున పెళ్లికాని యువతులు పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజు శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.

Also Read :Telangana Rice : తెలంగాణ బియ్యమా మజాకా.. క్యూ కడుతున్న రాష్ట్రాలు, దేశాలు!

ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ?

ఇళయరాజా బయోపిక్ కోసం అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌ చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. ఇందులో ఇళయరాజా పాత్రలో ధనుష్ నటిస్తున్నారు. ప్రస్తుతం కుబేర, ఇడ్లి కడాయ్, తేరే ఇష్క్ మే సినిమాల్లో ధనుష్ బిజీగా ఉన్నారు. నిర్మాతలు బడ్జెట్ లెక్కల వల్లే ఈ మూవీ షూటింగ్‌ను ఆపేశారని తెలుస్తోంది. ఈ మూవీకి ఇళయరాజానే సంగీతం సమకూర్చనున్నారు. ఇళయరాజాకు సంబంధించి బయటి వాళ్లకు తెలియని ఎన్నో కోణాలను ఈ మూవీలో చూపిస్తారని తెలుస్తోంది. సంగీత చక్రవర్తిగా వెలుగొందుతున్న ఇళయరాజా జీవిత విశేషాలతో పుస్తకం కూడా విడుదల చేస్తే బాగుంటుంది.

  Last Updated: 16 Dec 2024, 11:06 AM IST