Thaman : ఇటీవల ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో సినిమాని దెబ్బ తీయడానికి చూస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివిటీ చూపిస్తున్నారు. సినిమా రిలీజవ్వవకముందే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయడం, సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు చాలా రకాల నెగిటివిటీ వచ్చింది.
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాపై రిలీజ్ కి ముందు నుంచే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేసి మరీ నెగిటివిటీ చూపించారు. సినిమాను వేరే హీరోల అభిమానులే లీక్ చేసారు. సోషల్ మీడియాలో సినిమా డిజాస్టర్ అంటూ తెగ ప్రచారం చేసారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజులపై కూడా విమర్శలు చేసారు. డబ్బులు ఇవ్వకపోతే సినిమా లీక్ చేస్తామని మూవీ యూనిట్ నే బెదిరించారు. కథ మొత్తం సోషల్ మీడియాలో పెట్టేసారు. దీంతో మూవీ యూనిట్ కూడా సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.
గేమ్ ఛేంజర్ పై వస్తున్న నెగిటివిటీపై తాజాగా తమన్ ఇండైరెక్ట్ గా స్పందించాడు. నిన్న జరిగిన డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ.. ఇటీవల రోజుల్లో ఒక సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. చుట్టూ నెగిటివ్ ట్రోల్స్, ట్యాగ్స్ ఉంటున్నాయి. ఇటీవల సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు. మీ వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. అందరికి అన్నం పెట్టే దేవుళ్ళు నిర్మాతలు. వాళ్ళు ఎక్కడో ఫైనాన్స్ కి డబ్బులు తెచ్చి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే నెగిటివిటి కంటిన్యూ అయితే భవిష్యత్తులో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఉండరేమో అని భయమేస్తుంది. అందరి హీరోల ఫ్యాన్స్ కి బాధ్యత ఉంది. మీరు మీరు కొట్టుకోండి కానీ సినిమాలను నెగిటివ్ చేయకండి. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతుంటే మీరు మాత్రం ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఏ సినీ పరిశ్రమకు వెళ్లినా తెలుగులో ఒక సినిమా చేయాలి అని అడుగుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు. దీంతో తమన్ వ్యాఖ్యలు గేమ్ ఛేంజర్ పై నెగిటివిటీ చేసిన వారిపైనే అని వైరల్ అవుతున్నాయి.
Also Read : Mahesh Babu : పొంగల్ హిట్ వేడుకలో పెద్దోడు చిన్నోడు..!