Murali Mohan : మురళీమోహన్ లేకుండా ఎన్నికల ప్రచారమే లేదు – చంద్రబాబు

ఎంఎంఎం (మాగంటి మురళీమోహన్) Murali Mohan 50 ఏళ్ల సినీప్రస్థానం కార్యక్రమం (Murali Mohan 50 Years Golden Jubilee Celebrations)లో భాగంగా గత రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన ‘తెలుగునేల గౌరవం…తెలుగు సినీ గాండీవం’అనే పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సినిమాలు, రాజకీయాల్లో మురళీమోహన్ తనదైన ముద్ర వేశారు. ‘ఎన్టీఆర్ […]

Published By: HashtagU Telugu Desk
Murali Mohan 50 Years Golden Jubilee Celebrations

Murali Mohan 50 Years Golden Jubilee Celebrations

ఎంఎంఎం (మాగంటి మురళీమోహన్) Murali Mohan 50 ఏళ్ల సినీప్రస్థానం కార్యక్రమం (Murali Mohan 50 Years Golden Jubilee Celebrations)లో భాగంగా గత రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన ‘తెలుగునేల గౌరవం…తెలుగు సినీ గాండీవం’అనే పాటను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సినిమాలు, రాజకీయాల్లో మురళీమోహన్ తనదైన ముద్ర వేశారు. ‘ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ టీడీపీ తరఫున మురళీ మోహన్ ప్రచారం చేశారు. ఆయన లేకుండా మేం ఎన్నికలకు వెళ్లలేదు’ అని పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేశారని కొనియాడారు.. తాను హైటెక్ సిటీ నిర్మిస్తే పక్కనే జయభేరి ఎస్టేట్స్ పేరుతో బ్రహ్మాండంగా నిర్మాణాలు చేశారని గుర్తు చేశారు. 1100 మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేసి వారి జీవితాలను మార్చారని ప్రశంసించారు.

We’re now on WhatsApp. Click to Join.

1978లో తాను, వెంకయ్యనాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, అప్పట్లో ఆయనను చూస్తే అసెంబ్లీ గడగడలాడేదని తెలిపారు. 1984లో ఎన్టీఆర్‌ను సీఎంగా తొలగిస్తే వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నా ఎన్టీఆర్‌కు అండగా ఉండి సీఎం అయ్యేదాకా నిలబడ్డారని గుర్తు చేశారు. పదవులకు వన్నె తెచ్చిన వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ పురస్కారం రావడం తెలుగుజాతికే గర్వకారణమని అన్నారు. దేశంలో మెరుగైన ఆర్థికవ్యవస్థకు కృషి చేసిన పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రావడం సంతోషమన్నారు. పేదరికం లేని తెలుగుజాతిని చూడాలన్నదే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే నటుడు మురళీమోహన్ ఆరోగ్యానికి కారణమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మురళీమోహన్ 50ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ. ‘సినిమా రంగంలో 50ఏళ్లు కొనసాగడం గొప్ప విషయం. మురళీమోహన్ నటన చాలా సహజంగా ఉంటుంది. అందుకే మన ఇంట్లో వ్యక్తిలా ఉండిపోయారు’ అని తెలిపారు. తరతరాలూ గుర్తుపెట్టుకునేలా సినిమాలు తీయాలని పరిశ్రమకు ఆయన సూచించారు. ఇక ఈ వేడుకకు చిత్రసీమ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Read Also : Jyothi Rai : ఆ ప్లేస్‌లో టాటూ వేయించుకున్న ఫేమస్ నటి.. ఏం టాటూ?

  Last Updated: 11 Feb 2024, 10:52 AM IST