Murali Manohar : చాలా మంది డైరెక్టర్స్ బాగా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు ఇటీవల. తాజాగా లండన్ లో చదువుకొని వచ్చిన ఓ వ్యక్తి దర్శకుడిగా మారాడు. అయితే ఈయన ఇప్పుడు రాలేదు. చాలా ఏళ్ళ క్రితమే లండన్ లో చదివి వచ్చి టాలీవుడ్ లో దర్శకత్వ శాఖలో పనిచేసి ఇప్పుడు దర్శకుడిగా మారాడు.
అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సింబా’. సంపత్ నంది, రాజేందర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ మురళీ మనోహర్ లండన్ ఫిలిం స్కూల్ లో కోర్సులు చేసి అక్కడే రెండు ఇండీ సినిమాలకు పనిచేసాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అప్పట్నుంచి ఆయన దగ్గరే అన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసారు. సంపత్ నంది నిర్మాణ సంస్థలో లైన్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసారు.
ఇప్పుడు అదే సంపత్ నంది నిర్మాణంలో తనే డైరెక్టర్ గా సింబా సినిమాని తెరకెక్కించాడు. ఇటీవల జరిగిన సింబా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ మురళి మనోహర్. అయితే ఈ సింబా సినిమాని మొక్కలు, చెట్లు, అడవుల ప్రాధాన్యత కాన్సెప్ట్ తో కమర్షియల్ అంశాలని జోడించి చూపించనున్నాడు. ఇప్పటికే ట్రైలర్ వైరల్ అవుతుంది.
ఇటీవల సింబా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా హరిత హారాన్ని ముందుకు తీసుకెళ్లిన మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గెస్టులుగా వచ్చారు. సింబా సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శ్రీనాథ్, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి తమకు మెసెజ్ పంపిస్తే సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని తెలిపారు. మొక్కలు నాటి టికెట్స్ ఎలా పొందాలి అని మూవీ యూనిట్ త్వరలోనే విధి విధానాలు ప్రకటించనున్నారు.
Also Read : Vikram : రాజకీయాల్లోకి తమిళ్ ఇండస్ట్రీ నుండి మరో స్టార్..?