Site icon HashtagU Telugu

Mrunal Thakur: బీచ్‌లో మృణాల్ అందాలు.. బికినీలో సీతారామం బ్యూటీ..!

Mrunal

Mrunal

మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) గతేడాది తెలుగులో `సీతారామం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి చేరువ అయింది. మృణాల్‌ ఠాకూర్‌ ను ఇప్పటికి ఆ మూవీలో చేసిన సీతగానే ఊహించుకుంటున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం బోల్డ్ ఫోటో షూట్లతో షాకిలిస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తాజా చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇందులో మృణాల్ బికినీ లుక్‌లో కనిపించింది. మృణాల్ ఠాకూర్ తాజా చిత్రాలను చూసిన నెటిజన్లు ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నటిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి మృణాల్ ఠాకూర్ హిందీలో పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. మంగళవారం మృణాల్ ఠాకూర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తాజా చిత్రాలను పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మృణాల్ ఠాకూర్ సముద్ర తీరంలో నీలిరంగు బికినీలో సరదాగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోల్లో మృణాల్ ఠాకూర్ లుక్ చాలా హాట్ గా ఉంది.

Also Read: Bumber Offer: రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఒక్క పనిచేస్తే మీకు రూ.లక్ష

ప్రస్తుతం మృణాల్ నాని 30వ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం గోవాలో 40 రోజుల లాంగ్ షెడ్యూల్ మొదలు పెట్టారు. లేటెస్ట్ గా మృణాల్ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా ఎవరైనా హీరోయిన్ బికినీ వేస్తే సూపర్ అనేస్తారు కానీ మృణాల్ ని మాత్రం ఆమెని సీతారామం సినిమాలో అలా చూసి బికినీలో చూడలేకపోతున్నాం అంటున్నారు నెటిజన్లు. పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్లీజ్ మృణాల్ నువ్విలా చేయకు అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ అన్న తర్వాత అన్ని రోల్స్ చేయాల్సి ఉంటుంది. మృణాల్ గ్లామర్ రోల్స్ చేయకూడదా ఆమె బికినీ వేయకూడదా అంటూ కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. నాని 30లో కూడా మృణాల్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఇదే కాదు తెలుగు నుంచి మృణాల్ కి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి అని టాక్.