Site icon HashtagU Telugu

Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!

Mrunal Takur

Mrunal Takur

టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరుచుకుంది. అంతేకాకుండా ఇక్కడి వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నటించిన సినిమా హాయ్ నాన్న. నాని హీరోగా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. ఇకపోతే ఇప్పుడు మరొకసారి తెలుగు ప్రేక్షకులను పరికరించడానికి సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు అనగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకు కారణం తెలుగు ఆడియన్స్ తన పై చూపుతున్న ప్రేమ.

Also Read: Chiranjeevi: చిరంజీవి మొదట నిద్ర లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా?

తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి మృణాల్ తన ఫ్యామిలీని కూడా తీసుకు వచ్చారు. తనకి ఇక్కడ ఉన్న అభిమానాన్ని చూపించార. ఇక తన పై ఇంతటి అభిమానం చూపుతున్న తెలుగు అభిమానులకు కృతజ్ఞతగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను అంటూ.. స్టేజి పై నుంచి తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసారు.

Also Read: Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

మృణాల్ చేసిన ఈ పని తెలుగు ఫ్యాన్స్ మరింత ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఈ సందర్బంగా మృణాల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఫ్యామిలీ స్టార్ సినిమాతో మృణాల్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.

Exit mobile version