Mrunal Thakur Reveals Breakup : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గత రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను ఒక నటిని కావడమే తన బ్రేకప్‌కు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించడం వల్ల వచ్చే క్రేజ్, పని ఒత్తిడి మరియు తన వ్యక్తిత్వాన్ని ఆమె మాజీ ప్రియుడు అర్థం చేసుకోలేకపోయారని మృణాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిపరమైన కారణాలతో వ్యక్తిగత బంధాలు దెబ్బతినడం తనను కొంతకాలం ఇబ్బంది పెట్టినప్పటికీ, ఇప్పుడు ఆ నిర్ణయం సరైనదేనని ఆమె భావిస్తున్నారు.
మృణాల్ తన మాజీ భాగస్వామి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ.. “నువ్వు చాలా ఇంపల్సివ్ (ఆవేశపూరితంగా) ఉంటావు, దీన్ని నేను భరించలేను. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు హీరోయిన్ కావడం నాకు నచ్చదు” అని అతను మొహం మీదే చెప్పేశాడని తెలిపారు. ఒక మహిళగా తను సాధిస్తున్న విజయాన్ని, ఎంచుకున్న వృత్తిని గౌరవించలేని వ్యక్తితో కలిసి ఉండటం కంటే, ఆ బంధం నుంచి బయటకు రావడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ రిలేషన్ అప్పుడే ముగిసిపోవడం తన మంచికే జరిగిందని, లేదంటే భవిష్యత్తులో పిల్లలు, కుటుంబం విషయంలో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేవని ఆమె తన పరిణతిని చాటుకున్నారు.
ప్రస్తుతం మృణాల్ తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పక్కన పెట్టి, వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఈ బ్రేకప్ స్టోరీ విన్న అభిమానులు, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. వృత్తిని తక్కువ చేసి చూసే వ్యక్తి కంటే ఒంటరిగా ఉండటమే మేలని సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.
