Site icon HashtagU Telugu

Mrunal Thakur : ఆ విషయాల్లో వాళ్లిద్దరిని స్పూర్తిగా తీసుకున్నా అంటున్న మృణాల్..!

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. తెలుగులో సీతారామం తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుని వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. సీతారామం తర్వాత హాయ్ నాన్న సినిమాతో కూడా మరో హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. సీతారామం తన కెరీర్ ని టర్న్ చేసిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. అంతేకాదు ఆ సినిమా వల్ల తనకు ఇద్దరు మంచి స్నేహితులు దొరికారని అంటుంది.

ఆ సినిమాలో రష్మిక చేసిన పాత్ర చాలా డేర్ తో కూడినది. ఆ సినిమాలో అఫ్రీన్ పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. ఆ రోల్ కి ఆమె తప్ప మరెవరు న్యాయం చేయలేరు. ఎన్ని గంటలు పనిచేసినా ఆమెలో అలసట అనేది కనిపించదు. రష్మిక నుంచి ఆ విషయాన్ని స్పూర్తిగా తీసుకున్నా అంటుంది మృణాల్.

ఇక దుల్కర్ సల్మాన్ కూడా భాష ఏదైనా మంచి రోల్ వస్తే వెంటనే చేస్తూ వస్తున్నాడు. సినిమా పట్ల అతనికి ఉన్న అంకిత భావం అలాంటిది. తన జీవితంలో ఈ ఇద్దరిని స్పూర్తిగా తీసుకుని సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా అంటుంది మృణాల్. సీతారామం, ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా హిట్ పడితే అమ్మడికి తెలుగులో తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Also Read : Pooja Hegde : శారీలో బుట్ట బొమ్మ.. బాపు బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా..!