Site icon HashtagU Telugu

Mrunal Thakur : ముంబైలో ఆ ఏరియాలో ఇల్లు కొన్న మృణాల్..!

Prabhas Romance with Mrunal Thakur Hanu Raghavapudi Movie

Prabhas Romance with Mrunal Thakur Hanu Raghavapudi Movie

Mrunal Thakur టాలీవుడ్ లో రెండు వరుస హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ తన థర్డ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న అమ్మడు ఆ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తుంది. ముందు బాలీవుడ్ సీరియల్స్ చేసిన మృణాల్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హిందీలో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ సినిమాల్లో నటించింది.

తెలుగులో టాప్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఇప్పుడు ఇక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గా ముంబై లో ఒక ఇల్లు కొన్నదని తెలుస్తుంది. ముంబైలోని అంథేరి ఏరియాలో ఖరీదైన ఇల్లు సొంతం చేసుకుందట అమ్మడు. అయితే ఈ ఫ్లాట్ కంగనా రనౌత్ తండ్రి బ్రదర్ దని తెలుస్తుంది.

ఫ్లాట్ వాల్యూ 4 నుంచి 5 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత ప్రకారం కెరీర్ సూపర్ ఫాం లో ఉన్నప్పుడే వచ్చిన డబ్బులతో అమ్మడు ఒక సొంత ఫ్లాట్ కొనేసింది మృణాల్. ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం అమ్మడు ముంబైలోనే కాదు హైదరాబాద్ లో కూడా సొంత ఇల్లు కొనే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : VI Anand : హిట్టు కొట్టాడు మరో ఆఫర్ పట్టాడు.. AK బ్యానర్ లో భైరవకోన ఇంట్రెస్టింగ్ మూవీ..!