Mrunal Thakur ఎంత టాలెంట్ ఉన్నా సరే సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం లక్ ఫేవర్ చేస్తేనే ఇక్కడ కెరీర్ కొనసాగించే అవకాశం ఉంటుంది. వచ్చీరాగానే హిట్ కొట్టి సక్సెస్ ఫాం కొనసాగించే భామలు కొందరైతే.. చిన్నగా తమ టాలెంట్ తో మెప్పించి స్టార్ క్రేజ్ తెచ్చుకునే వారు కొందరు ఉంటారు. అయితే ఎంట్రీ తోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ ఆ తర్వాత ఆ సక్సెస్ మేనియా కొనసాగించడంలో తడబడతారు.
అయితే లేటెస్ట్ గా ఒక హీరోయిన్ మాత్రం తెలుగులో ఎంట్రీ ఇస్తూనే ఒక సూపర్ హిట్ కొట్టగా రీసెంట్ గా రిలీజైన తన సెకండ్ సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే సీతామహాలక్ష్మి అదేనండి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టి అక్కడ సత్తా చాటి ఆ తర్వాత సినిమా ఛాన్సులు అందుకున్న అమ్మడు సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Also Read : Banana and Milk: పాలు తాగిన తర్వాత అరటిపండు తినొచ్చా ? తినకూడదా?
ఇక రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడేసరికి మృణాల్ ఠాకూర్ క్రేజ్ డబుల్ అయ్యింది. అమ్మడి లక్కీ హ్యాండ్ వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయని ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తుంది.
చూడచక్కని అందం.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటన ఆమె సొంతం అందుకే మృణాల్ కెరీర్ అలా సక్సెస్ ఫుల్ గా ఉంది. హాయ్ నాన్న సినిమాలో యశ్న పాత్రలో మృణాల్ నటన ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అమ్మడు నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యేసరికి టాలీవుడ్ లక్కీ హ్యాండ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అమ్మడు.
We’re now on WhatsApp : Click to Join