Mrunal Thakur : విజయ్‌ దేవరకొండని మృణాల్ అంత మాట అనేసింది ఏంటి..!

స్టేజి పై అందరి ముందు విజయ్‌ దేవరకొండని మృణాల్ ఠాకూర్ ఏంటి.. అంత మాట అనేసింది.

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur Vijay Deverakonda

Mrunal Thakur Vijay Deverakonda

Mrunal Thakur : సీతారామం, హాయ్ నాన్న తరువాత తెలుగులో హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు మృణాల్ ఠాకూర్ నటించిన టాలీవుడ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేసారు. గీతగోవిందం తరువాత విజయ్ అండ్ పరుశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ నెలకుంది. ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ తెలుగు, తమిళంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా విజయ్, మృణాల్, నిర్మాత దిల్ రాజు కలిసి తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఓ విలేకరి మృణాల్‌ని.. “ట్రైలర్ లో మీరు విజయ్ ని మెంటల్ నాకొడక అని తిడుతూ కనిపించారు. దాని అర్ధం ఏంటో మీకు తెలుసా..?” అని ప్రశ్నించారు.

దీనికి మృణాల్ బదులిస్తూ.. “హ తెలుసు. ‘పాగల్ కా సన్’ అనే కదా అర్ధం. చెప్పాలంటే విజయ్ నిజంగానే మెంటల్ నా కొడుకు. కానీ తాను చాలా ప్రేమగల వ్యక్తి. రేలషన్‌షిప్ కొన్ని స్టేజిలు ఉంటాయి. ఫ్రెండ్‌షిప్, లవ్, మ్యారేజ్.. ఈ స్టేజిల్లో కోపం కూడా ఉంటుంది కదా. అదే మెంటల్ నా కొడుకా” అంటూ చెప్పుకొచ్చింది. ఇక స్టేజి పైనే విజయ్ ని మెంటల్ నా కొడుకు అని అనేయడంతో.. మృణాల్ ఏంటి అంత మాట అనేసింది అని అందరూ షాక్ అయ్యారు.

కాగా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాని హిందీ అండ్ మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళంలో రిలీజైన రెండు వారాలు తరువాత.. ఇక్కడి రిజల్ట్ ని బట్టి ఈ రెండు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఒకవేళ బాలీవుడ్ లో రిలీజైతే మృణాల్ స్టార్‌డమ్ ఫ్యామిలీ స్టార్ మార్కెట్ కి కలిసొచ్చే అవకాశం ఉంది.

Also read : Tollwood Stars: సమ్మర్ ఎఫెక్ట్.. విదేశాల్లో చిల్ అవుతున్న మహేశ్, రామ్ చరణ్

  Last Updated: 02 Apr 2024, 12:38 PM IST