Site icon HashtagU Telugu

Mr Bachchan Public Talk – హరీష్ కనిపిస్తే కొడతాం

Mr Bachchan Talk

Mr Bachchan Talk

షాక్, మిరపకాయ్ సినిమాలు తరువాత హరీష్ శంకర్ – రవితేజ (Harish Shankar – Raviteja) కలయికలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే మూవీ తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా.. 1980లో జరిగిన ఓ ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా రూపొందగా…దాని మెయిన్ థీమ్ ను తీసుకొని హరీష్ మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ ఫుల్ మాస్ లెవల్లో ఉండడం తో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కానీ సినిమా మాత్రం వారు అనుకున్న రేంజ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది అభిమానులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా మొత్తం కూడా పాత సినిమాల సన్నివేశాలు అతికించిపెట్టినట్లు ఉంది తప్ప..కొత్తగా ఏమి అనిపించలేదని వాపోతున్నారు. రైడ్ మూవీ మొత్తం సీరియస్‌గా సాగితే.. మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుందని… ప్రేక్షకుల చేత నవ్వించిలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలు అయినట్టుగా అనిపించిందని, అన్నపూర్ణ ట్రాక్ క్రింజ్‌గా అనిపిస్తే.. సత్య ట్రాక్ ఏమో.. మిరపకాయ్‌లో సునీల్ ట్రాక్‌ను గుర్తుకు తెచ్చిందని చెపుతున్నారు. భాగ్య శ్రీ అందాలఫై పెట్టిన ఫోకస్..స్క్రీన్ ప్లే ఫై హరీష్ పెడితే బాగుండని ఫ్యాన్స్ అంటున్నారు. మిక్కీ జే మేయర్ ఊర మాస్ సౌండ్ కు పెద్దగా వర్క్ అవుట్ కాలేదని..రవితేజ స్టామినాను హరీష్ ఉపయోగించుకోలేకపోయాడని అంటున్నారు. మరికొంతమందైతే హరీష్ కనిపిస్తే కొడతాం అంటూ హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రవితేజ ఖాతాలో మరో ప్లాప్ పడిందని భావిస్తున్నారు.

Read Also : Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే..?