Site icon HashtagU Telugu

Bellamkonda Sreenivas: హమ్మయ్యా.. మొత్తానికి ఫ్యాన్స్ కీ శుభవార్త చెప్పిన బెల్లంకొండ.. ఆ మూవీస్ కీ గ్రీన్ సిగ్నల్?

Bellamkonda Sreenivas

Bellamkonda Sreenivas

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. అల్లుడు శీను సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కువ సినిమాలలో నటించలేకపోయాడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నటుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join
అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. ఈ హీరో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ తో పాటు మూన్ షైన్ పిక్చర్స్ తో మరో రెండు ప్రాజెక్టుల కోసం చేతులు కలిపినట్టు వెల్లడించారు. అయితే అభిమానులు శ్రీనివాస్ ని ఇంతకుముందు ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూడబోతున్నారట. శ్రీనివాస్ ని మునుపెన్నడూ చూడని అవతారాల్లో, ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో ప్రెజెంట్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చారు. ఈ సినిమాలు కచ్చితంగా ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తాయని ధీమాతో చెబుతున్నాడు బెల్లంకొండ. అయితే టాలీవుడ్ రేసులో కాస్త వెనుకపడిన బెల్లంకొండ ఈ రెండు సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు.

Also Read: Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!

ఇతర హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ హీరో. అయితే ఈ ప్రాజెక్టులే కాకుండా మరో పెద్ద ప్రాజెక్టుతో మూవీ ఉండబోతుందని రివీల్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఓరియెంటెడ్, కంటెంట్ ఆధారిత కథలతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ హీరో సినిమాలకు హిందీలో ప్రత్యేకంగా అభిమానులు ఉండటంతో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడటంతో మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు బిజీ అయ్యాడు.

Also Read: Allu Arjun: వామ్మో.. అల్లు అర్జున్ కు ఏకంగా అన్ని కోట్ల ఆస్తి ఉందా?