Site icon HashtagU Telugu

Operation Sindoor Movie: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మూవీ.. పోస్టర్‌ వచ్చేసింది

Operation Sindoor Movie Poster Indian Army India Vs Pakistan

Operation Sindoor Movie: ‘ఆపరేషన్‌ సిందూర్’.. పాకిస్తాన్ ఉగ్రవాద మూకల వెన్ను విరిచింది. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఈ వీరోచిత సైనిక ఆపరేషన్ గురించి ఇప్పుడు యావత్ ప్రపంచంలో పెద్దచర్చ జరుగుతోంది. ‘ఆపరేషన్ సిందూర్’‌ యావత్ భారతీయులకు గర్వకారణం. భారతదేశ చరిత్రలో ఈ వివరాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి. ఇలాంటి గొప్ప అంశంపై సినిమా రాబోతోంది. ఔను.. నిజమే. వివరాలు చూద్దాం..

Also Read :India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్‌ ఎటాక్

పోస్టర్ ఇలా ఉంది.. 

ఉత్తమ్‌ నితిన్‌ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor Movie) సినిమా రాబోతోంది. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఆపరేషన్ సిందూర్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో భారత మహిళా జవాన్ ఆర్మీ యూనిఫాంను ధరించి, రైఫిల్‌ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటున్నట్టుగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో యుద్ధ విమానాలను, మండుతున్న యుద్ధ భూమి సీన్లు ఉన్నాయి.  ఈసినిమాను హిందీ భాషలో తీస్తానని ఉత్తమ్‌ నితిన్‌ ప్రకటించారు. తదుపరిగా అన్ని భారతీయ భాషల్లో దీని డబ్బింగ్ వర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించాలని కోరుతూ పలువురు ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే వారి నుంచి సినీ నిర్మాతలకు ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.

Also Read :Earthquake : పాకిస్థాన్‌లో భూ ప్రకంపనలు

15కుపైగా సంస్థల దరఖాస్తు

‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ ఆర్మీ ఆపరేషన్ మొదలుపెట్టిందని మే 7న ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆ టైటిల్‌ను రిజర్వ్ చేసుకునేందుకు దాదాపు 15కుపైగా సినీ నిర్మాణ సంస్థలు దరఖాస్తులు సమర్పించాయి.  ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌‌కు ఈమేరకు దరఖాస్తులు  సమర్పించిన సంస్థల జాబితాలో జీ స్టూడియోస్, టీ-సిరీస్‌ వంటి ప్రముఖ సినీ నిర్మాణసంస్థలు కూడా ఉన్నాయి.