Site icon HashtagU Telugu

Wayanad Landslides : వరద బాధితుల కోసం కదిలిన చిత్రసీమ

Movie Celebrities Donate To

Movie Celebrities Donate To

అభిమానులను అలరించడమే కాదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మేమున్నాం అంటూ చిత్రసీమ (Film Industry ) ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు వచ్చి ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లిన..ఆ బాధితులకు సాయం చేసేందుకు చిత్రసీమ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తుంటారు. తాజాగా కేరళ వరదల (Wayanad Landslides) కారణంగా వందలాది మంది మరణించడమే కాదు. వేలకోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్రసీమ నడుం బిగించింది. తమకు తోచిన సాయాన్ని అందజేస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇప్పటివరకు మోహన్ లాల్ 3 కోట్లు, కమల్ హాసన్ 25 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు, నయనతార – విగ్నేష్ జంట 20 లక్షలు, తెలుగు నిర్మాత నాగవంశీ 5 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాజిల్ , నజ్రియా కలిపి 25 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇంకా పలువురు సినీ నటీనటులు, ప్రముఖులు వయనాడ్ కి విరాళాలు ప్రకటించేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also : UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్