Monalisa : సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా పాపులర్ అవ్వడమే కాదు, సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుపోయింది. దర్శకుడు సనోజ్ మిశ్రా, నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆమె మొదటి సినిమా ప్రాజెక్టు ఆగిపోతుందో అనే ఆందోళనతో మోనాలిసా ఉన్నట్టుగా తెలుస్తోంది.
కథలోకి వెళితే, మోనాలిసా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి. ఆమె కుంభమేళాలో పూసలు అమ్మే చిన్న వ్యాపారం చేస్తూ, ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమె అందం, చిరునవ్వుతో కనిపించడం నెటిజన్లను ఆకర్షించింది, దీంతో ఆ ఫోటో వైరల్ అయింది. ఆమెను చూసేందుకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఆసక్తి చూపారు. కొన్ని సందర్భాల్లో ఆమెను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న మోనాలిసా తన వ్యాపారాన్ని ఆపి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆమెకు జరిగిన అన్యాయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.
HCA President: ఐపీఎల్‌కు హైదరాబాద్ సిద్ధం.. పలు విషయాలు పంచుకున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు!
ఈ సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసా ఫోటోలు చూసి, ఆమెకు తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించారు. మోనాలిసా కూడా సంతోషంగా మణిపూర్ నేపథ్యంతో రూపొందనున్న సినిమాలో నటించేందుకు సంతకం చేసింది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఆమె యాక్టింగ్ శిక్షణ తీసుకుంటోంది.
అయితే, ఈ క్రమంలో డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉండటం, ఆమె విషయాలను దగ్గరగా చూడటం పై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సనోజ్ మిశ్రా మీద తీవ్ర ఆరోపణలు చేసారు, “మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు, ఆమెను ట్రాప్ చేస్తున్నాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై సనోజ్ మిశ్రా తన వివరణలో, “మోనాలిసా నా కూతురి వయసు ఉంటుందని, ఆమెను తాను వేధించడం లేదు. ఆమె ఈ సినిమాను ఇష్టపూర్వకంగా చేస్తోంది. ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆమెకు శిక్షణ ఇస్తున్నాను” అని క్లారిఫై చేశారు. అయినప్పటికీ, ఈ వివాదం మరింత ముదిరిపోయింది. నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి సనోజ్ మిశ్రా పై తీవ్ర విమర్శలు చేశారు. “డైరెక్టర్ పబ్లిసిటీ కోసం మోనాలిసాను వాడుకుంటున్నాడు” అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వివాదం కారణంగా మోనాలిసా మొదటి సినిమా ప్రాజెక్టుపై తీవ్రమైన ఆందోళనకు గురైంది.
Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సహకారం