నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna,) మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని టాక్. ఐతే తొలి సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మోక్షజ్ఞ రెండో సినిమా కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. తొలి సినిమాను సూపర్ హిట్ డైరెక్ట్ర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతుండగా సెకండ్ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
వెంకీ అట్లూరి రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టాడు. లాస్ట్ ఇయర్ సార్ తో కూడా సక్సెస్ అందుకున్నాడు. సో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు కాబట్టి డైరెక్టర్ మీద నమ్మకంతో మోక్షజ్ఞ సినిమా ఆఫర్ ఇచ్చారట. ఐతే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమా ఇంకా మొదలు పెట్టకుండానే రెండో సినిమా వెంకీ అట్లూరితో చేయడం నందమూరి హీరో ప్లానింగ్ ఏంటన్నై తెలుస్తుంది.
బాలకృష్ణ నట వారసత్వాన్ని తన భుజాన మోసేందుకు మోక్షజ్ఞ సిద్ధమవుతున్నాడు. అంతకుముందు తన లుక్ చూసి విమర్శించిన వారు ఇప్పుడు అతని మేకోవర్ చూసి షాక్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ తో చేసే సినిమా లార్జ్ స్కేల్ లో భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఐతే వెంకీ అట్లూరి (Venky Atluri) సినిమా మాత్రం రెగ్యులర్ స్టోరీ అని తెలుస్తుంది.
వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం బాలయ్యతో డాకు మహారాజ్ నిర్మిస్తున్న ఈ బ్యానర్ లోనే మోక్షజ్ఞ సినిమా లాక్ చేశారు.
Also Read : Pushpa 2 First Day Target : పుష్ప 2 ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?