నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ, నిర్మాతగా తేజశ్విని ఫైనల్ అవ్వగా త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన భారీ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఐతే మోక్షజ్ఞ తొలి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అందుకే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారట. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హనుమాన్ సినిమాతో అదరగొట్టాడు. నేషనల్ లెవెల్ గా ఆయనకు మంచి క్రేజ్ ఉంది.
ఇప్పుడు అదే పాపులారిటీని బేస్ చేసుకుని మోక్షజ్ఞ (Mokshagna) సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో కల్కి స్టార్ ని కూడా నటింపచేసేలా చూస్తున్నారట. కల్కికో అశ్వథ్ధామ పాత్రలో అదరగొట్టిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ని కూడా సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తుంది. ఈమధ్యనే కల్కిలో ఆయన చేసిన నటన ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే.
ఆఫ్టర్ లాంగ్ టైం అమితాబ్ ని ఇష్టపడే ఫ్యాన్స్ అందరికీ అశ్వథ్ధామ పాత్రలో ఆయన్ను చూసి సూపర్ అనేశారు. ఇదివరకు సౌత్ సినిమాల్లో కనిపించినా కూడా అంతగా తన మార్క్ చూపించని అమితాబ్ కల్కి (Kalki) లో ప్రభాస్ కి ఈక్వల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన్ను కూడా మోక్షజ్ఞ సినిమా కోసం తీసుకోవాలని చూస్తున్నారట. అదే జరిగితే నందమూరి వారసుడి మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలనుకుంటున్నారు అంటే సినిమా కథ నెక్స్ట్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా విషయంలో అప్డేట్స్ ఎప్పుడు బయట పెడతారన్నది చూడాలి. ఐతే సెప్టెంబర్ లో మోక్షజ్ఞ బర్త్ డే ఉంది కాబట్టి అప్పటికల్లా సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు వస్తాయని తెలుస్తుంది.
Also Read : Nani : ఆ జోనర్ మాత్రం టచ్ చేయనంటున్న నాని..!