నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి. హరికృష్ణ మనవడు.. జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ (NTR) ను పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి వీణా రావుని పరిచయం చేస్తున్నారు. హీరోయిన్ ని పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు వైవీఎస్ చౌదరి.
జానకిరామ్ తనయుడిని పరిచయం చేసేందుకు ఆయన మదర్ పెట్టిన నిబంధనలు అన్ని ఒప్పుకున్నానని అన్నారు వైవీఎస్ చౌదరి. ఐతే ఈ ఎన్టీఆర్ సినిమా మోక్షజ్ఞ సినిమాకు పోటీ పడుతుందా అంటే ఎవరి సినిమా వారిది. అలాంటి పోటీ ఏమీ ఉండదు. మోక్షజ్ఞ సినిమా వస్తే అసలు మేము పోటీలో ఉండమని అన్నారు వైవీఎస్ చౌదరి.
తాను పరిచయం చేస్తున్న ఈ ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ నుంచి అందరి సపోర్ట్ ఉందని అన్నారు. మోక్షజ్ఞ (Mokshagna) సినిమా కోసం తాను కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని చెప్పారు వైవీఎస్ చౌదరి (YVS Chowdhary).
జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ హీరోగా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో ఒక ప్రేమకథ వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం వరుస ప్రెస్ మీట్ లు పెడుతూ వైవీఎస్ చౌదరి జానకిరామ్ తనయుడు ఎన్ టీ ఆర్ సినిమా గురించి ప్రేక్షకుల్లో చర్చ నడిచేలా చేస్తున్నాడు.
Also Read : Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8.. ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎవరంటే..?