Lucifer 2 : మలయాళంలో గతంలో హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్(Mohan Lal) మెయిన్ లీడ్ గా వచ్చిన పొలిటికల్ డ్రామా సినిమా లూసిఫర్ భారీ విజయం సాధించింది. ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ కూడా చేసారు.
కొన్ని నెలల క్రితం లూసిఫర్ సినిమాకు ప్రీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలోనే మోహన్ లాల్ మెయిన్ లీడ్ గా L2 – ఎంపురాన్ అనే టైటిల్ తో లూసిఫర్ ప్రీక్వెల్ ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా దీపావళి సందర్భంగా నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
మోహన్ లాల్ అధికారికంగా తన సోషల్ మీడియాలో L2 – ఎంపురాన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా 2025 మార్చ్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మళయాళంలోనే కాక వేరే భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. మరి లూసిఫర్ రేంజ్ లో ఈ ప్రీక్వెల్ సినిమా జనాల్ని మెప్పిస్తుందా చూడాలి.
లూసిఫర్ సినిమా క్లైమాక్స్ లో మోహన్ లాల్ గతంలో ఓ పెద్ద డాన్ అన్నట్టు చూపిస్తారు. ఈ సినిమాలో ఆ డాన్ స్టోరీతో పాటు ఆ కథలో ఉండే ప్రస్తుత పొలిటికల్ పరిస్థితులు కూడా చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది.
#L2E #EMPURAAN
The 2nd instalment of the #Lucifer franchise hits cinemas world wide on 27th March 2025!@PrithviOfficial #muraligopy @antonypbvr @aashirvadcine @Subaskaran_A @LycaProductions @gkmtamilkumaran @prithvirajprod #SureshBalaje #GeorgePius @ManjuWarrier4 @ttovino… pic.twitter.com/ILNOk4UYWU— Mohanlal (@Mohanlal) November 1, 2024
Also Read : Sobhita Dhulipala : కాకరపువ్వొత్తి బాక్స్ పై హీరోయిన్ ఫొటో.. అది షేర్ చేసి మరీ దీపావళి విషెస్..