Lucifer 2 Teaser : మలయాళంలో హీరో పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వంలో మోహన్ లాల్(Mohan Lal) మెయిన్ లీడ్ గా, మంజు వారియర్, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రలతో తెరకెక్కిన లూసిఫర్ సినిమా 2019 లో రిలీజయి పెద్ద హిట్ అయింది. కరోనా సమయంలో ఈ సినిమాని తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేసారు. ఓటీటీలో కూడా భారీ విజయం దక్కించుకుంది. ఈ సినిమాని చిరంజీవి గాడ్ ఫాదర్ అనే పేరుతో రీమేక్ కూడా చేసారు.
అయితే ఈ సినిమాకు గతంలోనే సీక్వెల్ అనౌన్స్ చేసారు. లూసిఫర్ 2 ఎంపురాన్ అనే పేరుతో ఈ సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1 లో మొదలుపెట్టిన పొలిటికల్ గేమ్ కంటిన్యూ చేస్తూనే మోహన్ లాల్ ఫ్లాష్ బ్యాక్ అబ్రహం ఖురేషి గురించి, అతను మళ్ళీ రిటన్ అయితే ఎలా ఉంటుంది అని చూపించారు. ఈ సినిమాలో మోహన్ లాల్ మరింత స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు. అబ్రహం ఖురేషి, స్టీఫెన్ గట్టుపల్లి రెండు పాత్రల్లో మోహన్ లాల్ మరోసారి అదరగొట్టబోతున్నారు. మీరు కూడా లూసిఫర్ 2 ఎంపురాన్ టీజర్ చూసేయండి..
ఈసారి లూసిఫెర్ 2 సినిమాని పాన్ ఇండియా వైడ్ మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ తో ప్రకటించారు.
Also Read : All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?