Suicide Attempt: తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే మనోజ్, మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు మరింత చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. మోహన్ బాబు ఇంట్లో పని చేసే ఓ పని మనిషి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో అసలు గొడవకు కారణం ఏంటి? ఎవరు ఎవర్నీ కొట్టారు? మౌనికను పెళ్లి చేసుకోవటం మంచు కుటుంబానికి ఇష్టం లేదని, మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నాడని ఆ పని మనిషి చెప్పిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ విషయం తెలిసిన ఆ పని మనిషి భయంతో ఆత్మహత్యాయత్నం
(Suicide Attempt) చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు. ఇదిలా ఉంటే మంచు మోహన్‌బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి.. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Mohan Babu Attack on Media : మోహన్ బాబు దాడిలో జర్నలిస్ట్ రంజిత్‌కు బోన్ ఫ్యాక్చర్
మోహన్ బాబుకు నోటీసులు
తన కుమారుడు మనోజ్‌తో వివాదం గురించి కవరేజీ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో ఆ జర్నలిస్టు తలకు గాయం అయ్యింది. దీంతో జర్నలిస్టు సంఘాల డిమాండ్ మేరకు.. మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అందులో ఆదేశించారు.
మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉందంటే?
రెండు గంటలపాటు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామా కాస్త చల్లబడింది. మోహన్‌బాబు ఇంటి సమీపంలోకి ఇతరులను పోలీసులు అనుమతించటంలేదు. మరోవైపు మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబు కాలికి స్వల్ప గాయం కావటంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. మనోజ్ సైతం జల్‌పల్లిలోని నివాసంలో ఉన్నట్లు సమాచారం.