కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో భారీ దొంగతనం (Theft ) జరిగింది. హైదరాబాద్ (Hyderabad) జల్ పల్లి(Jal Pally)లో మోహన్ బాబు నివాసం (Residence ) ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో గత కొంతకాలంగా గణేశ్ (Ganesh) అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూనే భారీ చోరీ చేసాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా రూ. 10 లక్షలు మాయమైనట్టు గుర్తించారు. దీంతో పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు… గణేశ్ కోసం గాలింపు చేపట్టి..అతని తిరుపతిలో పట్టుకున్నారు. ప్రస్తుతం అతడ్ని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.
సినీ ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు అనేవి కామన్ గా మారిపోయాయి. ఇంట్లో నమ్మకంగా పని చేస్తూనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. సినీ ప్రముఖుల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు , బంగారం అనేది ఉంటుంది. దీంతో నమ్మకంగా ఉంటూ వాటిపై కన్నేసి..ఎవ్వరు లేని సమయంలో కొట్టేస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు చేయడం తగ్గించాడు. విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప (Kannappa) లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Read Also : Farm Laws : సాగు చట్టాలపై వ్యాఖ్యలకు కంగనా రనౌత్ క్షమాపణలు