Mohan Babu: మోహన్ లాల్ ని రిక్వెస్ట్ చేసిన మోహన్ బాబు.. ప్లీజ్ విలన్ క్యారెక్టర్ ఇవ్వు అంటూ?

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 03:34 PM IST

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం తాజాగా మంగళవారం రాత్రి తిరుపతిలో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపిన మోహన్ బాబు, కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..

నేను హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి అంతా పోగొట్టుకున్నాను. అలాంటి సమయంలో మోహన్ లాల్ తీసిన చిత్రం సినిమాని నేను అల్లుడు గారు అని తెలుగులో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాను. మోహన్ లాల్ సినిమా వల్లే మళ్ళీ నేను కెరీర్ లో సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అలాగే మోహన్ లాల్ మంచితనం గురించి మాట్లాడుతూ.. మోహన్ లాల్ నా బిడ్డ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఇంకా రెమ్యునరేషన్ తీసుకోలేదు.

అడిగితే ప్రస్తుతానికి వద్దు నేను వచ్చి నటించి వెళ్తాను అన్నాడట. అలాగే స్టార్ నటుల్ని వేరే దేశాలకు తీసుకెళ్లాలంటే వాళ్ళతో పాటు ఐదారుగురు అసిస్టెంట్స్ కూడా వస్తారు. కానీ మోహన్ లాల్ ఎవ్వరూ వద్దు, నేను ఒక్కర్నే తెచ్చుకుంటాను. నా మేకప్ నేనే వేసుకుంటాను, నిర్మాతకు ఖర్చు పెరగొద్దు అని కన్నప్పకి ఒక్క అసిస్టెంట్ తోనే వచ్చాడు. అంత మంచి మనిషి ఆయన అని తెలిపారు. ఇక చివర్లో.. నేను, మోహన్ లాల్ ఎప్పట్నుంచో మంచి మిత్రులం. కానీ మేమిద్దరం ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఇప్పుడు కన్నప్పలో ఇద్దరం నటిస్తున్నా మా ఇద్దరికీ కాంబో సీన్స్ లేవు. దయచేసి నీతో నటించడానికి నీ సినిమాలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ప్లీజ్ నాకు నీ పక్కన ఒక విలన్ రోల్ ఇవ్వు. కానీ నువ్వు నన్ను కొట్టొద్దు, కావాలంటే గట్టిగా అరువు నా మీద అని అడిగారు మోహన్ బాబు. దీంతో స్టేజి ముందు కూర్చున్న మోహన్ లాల్ ఓకే అని అన్నారు. దీంతో మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.