Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు (Tirumala Laddu) వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాకరేపుతుంది. ప్రతి రోజు తిరుమలకు లక్షలాది మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకొని , అనంతర శ్రీవారి లడ్డును స్వీకరిస్తారు. తిరుమల లడ్డు అంతే ఆ ప్రత్యేకత వేరు. ఎన్ని రుచులు ఉన్న శ్రీవారి లడ్డు రుచి తర్వాతే అని నమ్ముతారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి వేలాది కోట్ల ఆస్తిపరులు సైతం తిరుమల లడ్డును ఇష్టంగా స్వీకరిస్తారు. అలాంటి తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున భక్తులు, హిందూ సంఘాలు, రాజకీయేతర పార్టీల నేతలు కాదు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..దోషులకు కఠిన శిక్షలు వేయాలని , దేవుడు ఎవర్ని క్షమించరాని శాపనార్దాలు పెడుతున్నారు.
ఇప్పటికే దీనిపై అనేకమంది స్పందించగా..తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రియాక్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌బాబు పేర్కొన్నారు. నిత్యం మా మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని ఆయన వెల్లడించారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకమంటూ మండిపడ్డారు. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఆత్మీయుడు, మిత్రుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మోహన్‌బాబు అన్నారు. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మిత్రుడు అందుకుని సూరేళ్ళు చల్లగా ఉండాలని మోహన్‌బాబు కోరుకున్నారు.
విజ్ఞప్తి pic.twitter.com/7l8UT9Fbs5
— Mohan Babu M (@themohanbabu) September 21, 2024
Read Also : The Raja Saab : అక్టోబర్ 23న ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్