Manchu Family Fight Issue : మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్

Manchu Family Fight Issue : జల్‌పల్లి నివాసంలో తనపై దాడి చేయడమే కాకుండా.. సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారంటూ కిరణ్‌తో పాటు వినయ్ రెడ్డిపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం

Published By: HashtagU Telugu Desk
Kiran Arrest

Kiran Arrest

మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు (Manchu Family Fight Issue) రోడెక్కడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు విష్ణు – మనోజ్ (Vishnu Vs Manoj)ల మద్యే గొడవలు ఉన్నాయని అనుకున్నారు కానీ..మోహన్ బాబు – మనోజ్ (Mohan Babu Vs Manoj)ల మధ్య కూడా వివాదం నడుస్తుందని తాజాగా బయటపడింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమే కాదు..ఆఖరికి కొట్లాట వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే.. బుధవారం రోజున(డిసెంబర్ 11న) మోహన్ బాబు మేనేజర్, విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌(Kiran Arrest)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు విజయ్‌ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

జల్‌పల్లి నివాసంలో తనపై దాడి చేయడమే కాకుండా.. సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారంటూ కిరణ్‌తో పాటు వినయ్ రెడ్డిపై పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. దీంతో.. ఈ మంచువారి ఫ్యామిలీ ఫైట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టయింది. ఇక నిన్న మంగళవారం జరిగిన గొడవ తర్వాత మోహన్ బాబు అస్వస్థత కు గురి కావడంతో ఆయన్ను హాస్పటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మనోజ్ సైతం ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయటపెడతానని ప్రకటించాడు. కానీ ఏమైందో కానీ సాయంత్రం సడెన్ గా ప్రెస్ మీట్ రద్దు చేస్తున్నట్లు తెలిపాడు. మొత్తం మీద మంచు ఫ్యామిలీ గొడవ రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతోంది.

Read Also : AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

  Last Updated: 11 Dec 2024, 08:36 PM IST