Miss Universe India : ఈ ఏడాది (2024) ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా ఎంపికైన రియా సింఘా కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగబోయే రాంలీలా షోలో తాను సీత పాత్రను పోషించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రాంలీలా ప్రదర్శనను అయోధ్యలో ఏటా ఒకసారి నిర్వహిస్తుంటారు. ఈసారి ఇందులో 42 మంది నటులు ఉండబోతున్నారు. ఈ జాబితాలో నటులు మనోజ్ తివారీ, రవి కిషన్ వంటి వారు ఉన్నారు. వాలి పాత్రను తివారీ పోషిస్తుండగా.. సుగ్రీవుడి పాత్రను కిషన్ (Miss Universe India) పోషిస్తారు. వేదవతి పాత్రను నటి భాగ్యశ్రీ, శబరి పాత్రను నటి మాలినీ అవస్థి పోషించనున్నారు.దీంతో ఈసారి అయోధ్యలో రాంలీలా షో ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also Read :Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
‘‘అయోధ్య రామయ్య ఆశీర్వాదంతో రాంలీలా షోలో సీతామాత పాత్రను పోషించే అవకాశం నాకు లభించింది. ఆ పాత్రలో నటించనుండటం నా లక్. ప్రపంచంలోనే అత్యంత భారీగా రాంలీలా వేడుకను అయోధ్యలో నిర్వహిస్తుంటారు. అందులో నటించే ఛాన్స్ దక్కినందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం లభించినందుకు నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను’’ అని రియా సింఘా చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా అయోధ్య రాంలీలా నిర్వాహకులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. రాముడు జన్మించిన పుణ్యస్థలిలో సీతామాత్ర పాత్రలో నటించే అవకాశం దక్కడం చాలా గొప్ప విషయమని రియా తెలిపారు. అయోధ్య రాంలీలా కార్యక్రమ వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ మాట్లాడుతూ.. ఈసారి రాంలీలా ప్రదర్శనను 50 కోట్ల మందికిపైగా చూడబోతున్నారని చెప్పారు. దాదాపు 42 మంది నటులు వివిధ పాత్రలను పోషించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. రామభక్తులు ఈసారి అయోధ్య రాంలీలా షోను చూసేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. తాము అత్యుత్తమ నటులతో ఈ షోను నిర్వహించేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశామని సుభాష్ మాలిక్ చెప్పారు.