Site icon HashtagU Telugu

Minister Roja : చరణ్‌కి కూతురు పుట్టినందుకు రోజా స్పెషల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను అంటూ..

Minister Roja Special Tweet for Ram Charan and Upasan wishing congrats tweet goes viral

Minister Roja Special Tweet for Ram Charan and Upasan wishing congrats tweet goes viral

మెగా ఫ్యామిలి(Mega Family)లో వారసురాలు పుట్టిన సంగతి తెలిసిందే. నిన్న మంగళవారం జూన్ 20న రామ్ చరణ్(Ram Charan) – ఉపాసన(Upasana)లకు ఆడపిల్ల పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు నెలకొన్నాయి. చిరంజీవి(Chiranjeevi) నుంచి మెగా ఫ్యామిలీ అంతా హాస్పిటల్ కి వచ్చి పాపని చూసి సంతోషించారు. ఇక మెగా అభిమానులు కూడా ప్రిన్సెస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చరణ్ ఉపాసనలకు.. స్టార్ హీరోలు, హీరోయిన్స్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు చేశారు. తాజాగా మంత్రి రోజా(Minister Roja) కూడా చరణ్ ఉపాసనలకు స్పెషల్ గా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది. రోజూ పవన్ ని తిట్టే రోజా ఇవాళ చరణ్, చిరు గురించి ఎమోషనల్ గా ట్వీట్ వేయడంతో ఇది వైరల్ గా మారింది.

రోజా తన ట్వీట్ లో.. చిరంజీవి గారికి తాతయ్య అయినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మనవరాలికి మీరు ఎవరు గ్రీన్ హీరోలా నిలిచిపోతారు.ఎప్పుడూ సంతోషంగా ఉండే మీ కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ ఆశీర్వదంలా వచ్చింది. చరణ్ నిన్ను నేను చిన్నప్పుడు ఎత్తుకున్న రోజులను గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నీ కూతురిని ఎత్తుకునే రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఉపాసన, మీ ఇంటి లిటిల్ మహాలక్ష్మికి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని తెలిపింది.

 

Also Reda : Ram Charan – Upasana : మెగా వారసురాలు వచ్చేసింది.. డెలివరీ అయిన ఉపాసన..