Site icon HashtagU Telugu

Tamannah Special Song in Manchu Vishnu Kannappa : కన్నప్పలో మిల్కీ బ్యూటీ కూడానా.. మంచు విష్ణు పెద్ద స్కెచ్చే వేశాడుగా..!

Tamannah

Tamannah

Tamannah Special Song in Manchu Vishnu Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాను ముందు లిమిటెడ్ బడ్జెట్ లో కానిచ్చేద్దాం అనుకోగా కథ డిమాండ్ మేరకు భారీ తారాగణం యాడ్ అవుతూ వస్తున్నారు. సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ నటిస్తున్నారని తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కన్నప్పలో భాగం అవుతున్నాడు.

సినిమాలో నటిస్తున్న కాస్టింగ్ చూస్తే మంచు విష్ణు భారీ ప్లానింగ్ తోనే కన్నప్ప చేస్తున్నాడని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కాజల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా లేటెస్ట్ గా తమన్నాని కూడా సినిమాలో తీసుకుంటున్నారని టాక్. కన్నప్పలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాని ఎంపిక చేశారట.

కన్నప్ప లాంటి సినిమాలో స్పెషల్ సాంగా అని డౌట్ పడొచ్చు. ఆ సాంగ్ కూడా సినిమాకు యాప్ట్ అయ్యేలా ఉంటుందట. కన్నప్ప ఇప్పటివరకు జరిగిన షూటింగ్ మాత్రం సాటిస్ఫైడ్ గా ఉందని చెబుతున్నారు. సినిమాలో ఒక్కొక్కరు యాడ్ అవుతూ ప్రాజెక్ట్ ని పెద్దది చేస్తున్నారు.

ఈ సినిమాతో కెరీర్ ని రిస్క్ లో పెట్టి నటుడిగానే కాదు నిర్మాతగా మారి చేస్తున్నాడు మంచు విష్ణు. మరి మంచు హీరో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మంచు విష్ణు ఈ సినిమాతో సూపర్ హిట్ కొడితే మాత్రం ఇలాంటి సినిమాలు ఎన్నో చేసేందుకు ముందుకొస్తారని చెప్పొచ్చు.

Also Read : Malavika Mohanan : అనుష్క, సమంత ఇద్దరూ ఇష్టమే అంటున్న రాజా సాబ్ బ్యూటీ..!