Site icon HashtagU Telugu

Met Gala 2025 : ‘మెట్ గాలా’కు ఏడుగురు భారతీయులు.. ఏమిటిది ? షాకింగ్ రూల్స్ !

Met Gala 2025 Indian Celebrities Bollywood Celebrities

Met Gala 2025 : మెట్ గాలా (Met gala) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ వేడుక. ఇది ఈరోజు రాత్రి అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల నుంచే అతిథులంతా మెట్ గాలా ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు.  ఈసారి వేడుకలో భారత్ నుంచి షారుక్‌ ఖాన్‌, కియారా అడ్వాణీ, దిల్జిత్‌, ప్రియాంకా చోప్రా,  వ్యాక్సిన్ తయారీ దిగ్గజం అదర్ పూానావాలా సతీమణి నటాషా పూనావాలా, ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ,  ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ మోనా పటేల్  పాల్గొంటున్నారు. ఈ ఏడాది ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్’ అనే థీమ్‌తో మెట్‌గాలా ఈవెంట్‌ జరగనుంది.

ఒక టికెట్ ఖరీదు 75వేల డాలర్లు.. ఎవరిస్తారు ? 

ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌లో(Met Gala 2025) ఈ వేడుక జరుగుతుంది. ప్రతి ఏటా ఒక్కో థీమ్‌లో మెట్ గాలా ఈవెంటును నిర్వహిస్తారు.మెట్ గాలా ఈవెంట్ల ద్వారా వచ్చే నిధులను మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌కు అందిస్తారు. మెట్‌ గాలాకు ఆహ్వానం పొందిన ఒక్కో సెలబ్రిటీ ఈసారి 75 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్ల ఖర్చులను ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీలు భరిస్తాయి. అవి టికెట్లను కొని సదరు సెలబ్రిటీలకు అందిస్తాయి. ఇందుకు ప్రతిగా ఆయా ఫ్యాషన్ బ్రాండ్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ధరించి మెట్ గాలాలో సెలబ్రిటీలు సందడి చేయాల్సి ఉంటుంది.

ఏమిటీ మెట్ గాలా ? ఎలా మొదలైంది ? 

మెట్ గాలా అనేది ఒక సంస్థ పేరు. దీని అసలు పేరు కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ బెనెఫిట్. ప్రపంచంలో కాస్ట్యూమ్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫ్యాషన్ డిజైనింగ్ ఉత్పత్తుల విక్రయాలను పెంచడమే ఈ సంస్థ టార్గెట్.  మెట్ గాలా సంస్థ ఆధ్వర్యంలో ‘మ్యూజియం ఆఫ్ కాస్ట్యూమ్ ఆర్ట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. 1937 సంవత్సరంలో మెట్ గాలా మ్యూజియం ఏర్పాటైంది. ఐరీన్ ల్యూజోన్ అనే మహిళ  దీన్ని ఏర్పాటు చేశారు. ఐరీన్ ల్యూజోన్ తండ్రి ఒక యూదు మతస్తుడు. తొలినాళ్లలో వీరు పిల్లలు, యువతకు డ్యాన్సులు వేయడం, పాటలు పాడటం, నాటకాలు వేయడం నేర్పించేవారు. ఒకరకంగా చెప్పాలంటే ఐరీన్ ల్యూజోన్ కళలను ప్రోత్సహించింది. న్యూయార్క్ నగరంలో అత్యధిక సంఖ్యలో యూదు మతస్తులు నివసిస్తుంటారు. వాటిలోని ఒక యూదు కుటుంబంలో ఐరీన్ ల్యూజోన్ జన్మించారు. ఆమె 1886లో జన్మించగా, 1944లో చనిపోయారు. మెట్ గాలా మొదటి ఈవెంట్ 1948 డిసెంబరులో జరిగింది.  ఫ్యాషన్ ప్రపంచంపై అత్యంత అభిమానం కలిగిన ఎలీనర్ లాంబర్ట్ ఆధ్వర్యంలో దీన్ని ఆనాడు నిర్వహించారు. ఎలీనర్ లాంబర్ట్  1903లో జన్మించి, 2003లో చనిపోయారు.

Also Read :AP Power Sector : ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగం.. నైపుణ్యభరిత నాయకత్వం, హరిత ఇంధనంపై ఫోకస్‌తో మున్ముందుకు

2025 మెట్ గాలా రూల్స్..  తెలిస్తే షాకవుతారు

Also Read :Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?

Exit mobile version