Samantha: పింక్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న సమంత, లేటెస్ట్ పిక్స్ వైరల్

భారతీయ సినిమాలో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాను ఆకర్షిస్తూనే ఉంది.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 01:28 PM IST

Samantha: భారతీయ సినిమాలో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాను ఆకర్షిస్తూనే ఉంది. పండుగ సందర్భాలు, సాధారణ విహారయాత్రలు, వివిధ ఈవెంట్స్ లో సమంత ఫ్యాషన్ సెన్స్ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను షేర్ చేసింది. మంత్రముగ్దులను చేసే గులాబీ చీరలో తన అందాన్ని ప్రదర్శిస్తుంది.

సమంత ఉల్లిపొర లాంటి పింక్ చీర కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. పింక్ చీర, స్లీవ్‌లెస్ వైట్ బ్లౌజ్‌తో మెస్మరైజ్ చేసింది.  తన లుక్స్ తగ్గటుగా చేతి గాజులు, ఇయర్ రింగ్స్ ధరించి సెక్సీ అప్పీల్ తో కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి “ఖుషి” సినిమాలో నటించి ఆకట్టుకుంది. సమంత అత్యుత్తమ నటనతో ఒకవైపు పేరు తెచ్చుకుంటూ, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ మరోవైపు అలరిస్తోంది.

కాగా ‘కెప్టెన్‌ మార్వెల్‌ నాకు అత్యంత ఇష్టమైన సూపర్‌హీరో అని సమంత చెప్పింది. ఈసారి ముగ్గురు శక్తివంతమైన సూపర్‌హీరోలు చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పాల్గొంటున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘ది మార్వెల్స్‌’ చిత్రం ఈ నెల 10న ఇంగ్లీష్‌, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది సమంత.