Mass Megastar: మెగా బ్లాస్టింగ్ కు ‘వాల్తేరు వీరయ్య’ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్స్ జోరు పెంచాడు. వాల్తేరు వీరయ్య నుంచి మరో లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
mass megastar, tollywood

Waltair Veeraiah

మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మాస్ మహారాజ రవితేజ (Raviteja) కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్, బాస్ పార్టీ లిరికల్ సాంగ్ తో పాటు రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశాయి.

దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ (Twitter) లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు. ఇక చిరంజీవి (Chiranjeevi) బాస్ పార్టీ సాంగ్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

Also Read: Asian Google Beauties: అలియా, దీపికాను బీట్ చేసిన కత్రినా.. ఏషియన్ గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్!

  Last Updated: 16 Dec 2022, 12:07 PM IST