Site icon HashtagU Telugu

Mega157: బింబిసార డైరెక్టర్ తో చిరు కొత్త చిత్రం, భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ

Mega157

Mega157

జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ చిరంజీవికి, ఆయన అభిమానులకు మరపురాని సినిమాలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఆ సినిమా తర్వాత చిరంజీవి సరైన ఫాంటసీ సినిమా చేయలేదు. అయితే పుట్టినరోజు పురస్కరించుకొని మెగా157 ఫాంటసీ చిత్రంగా ఉంటుందని అభిమానులు ఆశిసుతన్నారు. . తన తొలి చిత్రం బింబిసారతో విమర్శకుల ప్రశంసలు పొంది బ్లాక్‌బస్టర్‌ను అందించిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై దీన్ని నిర్మిస్తుంది.

వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మాతలు. భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశంలోని ఐదు అంశాలని చూపే ఈ కన్నుతో పోస్టర్‌తో చిరంజీవి పుట్టినరోజున మెగా157 ప్రకటించబడింది. నక్షత్రాకారంలో ఉన్న వస్తువులో మనం త్రిశూలాన్ని చూడవచ్చు. అనౌన్స్ మెంట్ పోస్టర్ అందర్నీ ఆకర్షిస్తోంది. మెగా157తో వశిష్ట మనల్ని మరో ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవికి అత్యంత ఖరీదైన సినిమా ఇదే. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో చిరు సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుంటున్నాడని, న్యూఢిల్లీలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక మెగా స్టార్ కొత్త సినిమాలేవీ అంగీకరించరని రూమర్స్ వినిపించాయి. కానీ ఆ పుకార్లకు చెక్ పెడుతూ చిరంజీవి మరింత దూకుడు పెంచారు. పరాజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు.  అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం మెగాస్టార్ మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ ఇవ్వనున్నట్టు సమాచారం. అందులో ఒకటి బింబిసార డైరెక్టర్ తో కాగా, మరొకటి కళ్యాణ్ కృష్ణతో కలిసి ఓ కామిక్ ఎంటర్‌టైనర్‌ చేయనున్నాడు.

Also Read: Rashmika-Vijay: రష్మిక తో మళ్లీ నటించాలనుంది: విజయ్ దేవరకొండ