Megastar Viswambhara : విశ్వంభర టీజర్ ఎప్పుడు.. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్..!

చిరు పాన్ ఇండియా (PAN India) అటెంప్ట్ చేస్తున్నాడు. తప్పకుండా ఇది మెగా మాస్ విధ్వంసం సృష్టించడానికి వస్తుందని అంటున్నారు. మరి సినిమాపై ఉన్న ఈ అంచనాలను విశ్వంభర

  • Written By:
  • Publish Date - July 20, 2024 / 11:42 AM IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమాపై ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. చిరు ని మరోసారి వింటేజ్ లుక్ తో చూపించి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు కూడా నటిస్తున్నారు.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే మెగా విశ్వంభర నుంచి త్వరలో ఒక టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. విశ్వంభర సినిమా టీజర్ ని చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారట. ఆగష్టు 22న చిరు పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ రాబోతుంది.

విశ్వంభర ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచగా ఇక రాబోతున్న ఈ టీజర్ తో సినిమాపై మరి కాస్త బజ్ పెంచాలని చూస్తున్నారు. విశ్వంభర టీజర్ (Viswambhara Teaser) లో విజువల్స్ కూడా గూస్ బంప్స్ అనిపించేలా చేస్తాయని అంటున్నారు. మొత్తానికి టీజర్ తోనే మెగా బాస్ సినిమాపై తారాస్థాయి అంచనాలను పెట్టుకునేలా చేస్తున్నాడు వశిష్ట.

ఈ సినిమాతో చిరు పాన్ ఇండియా (PAN India) అటెంప్ట్ చేస్తున్నాడు. తప్పకుండా ఇది మెగా మాస్ విధ్వంసం సృష్టించడానికి వస్తుందని అంటున్నారు. మరి సినిమాపై ఉన్న ఈ అంచనాలను విశ్వంభర అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమాను జనవరి 10, 2025 న రిలీజ్ లాక్ చేశారని తెలిసిందే. ఈ సినిమాకు చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరికి లింక్ ఉందని ఒక న్యూస్ వచ్చింది. ఐతే అది కాదు కానీ ఆ సినిమా రేంజ్ విజువల్ ట్రీట్ గా విశ్వంభర ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

Also Read : Balakrishna : బాలయ్య సినిమాలో మళ్లీ ఆమె ఎంట్రీ.. సెంటిమెంట్ కోసమేనా..?

Follow us