Megastar Injured: మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయమైనట్లు (Megastar Injured) తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో శనివారం విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి చనిపోయారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ను పరమర్శించడానికి చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ వచ్చారు. అయితే చిరు కారులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన ఎడమ చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. ఎడమ చేయికి గాయండఅవ్వడంతో చిరు బ్యాండేజ్ వాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ గాయంపై చిరు లేదా విశ్వంభర చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.
చిరంజీవిని పట్టుకొని ఎక్కెక్కి ఏడ్చిన రాజేంద్ర ప్రసాద్! #RajendraPrasad #gayatridevi #HashtagU pic.twitter.com/SQGbgOix8l
— Hashtag U (@HashtaguIn) October 5, 2024
అయితే గాయం గురించి ఇంతవరుకు ఎవరూ చెప్పకపోవటం గమనార్హం. ఇటీవల చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐఫా ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో సహా కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో చిరు చేతికి ఎలాంటి కట్టులేదు. అయితే దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విశ్వంభర షూటింగ్‌లో మెగాస్టార్ పాల్గొన్నట్లు సమాచారం.
Also Read: Laddu Quality: తిరుమల లడ్డూ నాణ్యత పెరిగిందా? సీఎం సమాధానం ఇదే!
ఈ షూటింగ్ సమయంలోనే చిరు ఎడమచేతికి గాయమై ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చిరు విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. సినిమా అనుకున్న టైమ్‌కు రావటం కోసమే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోందని ఇండస్ట్రీలో టాక్. యువ దర్శకుడు వశిష్ఠ ఈ మూవీలో చిరును కొత్త లుక్‌లో చూపించబోతున్నారని సమాచారం. ఈ మూవీలో చిరు సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్‌ను చిత్రయూనిట్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.