Chiru Wish To Venky: డియర్ వెంకీ ‘హ్యాపీ బర్త్ డే’.. వేర్ ఈజ్ ద పార్టీ?

వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.

  • Written By:
  • Updated On - December 13, 2022 / 12:20 PM IST

టాలీవుడ్ అగ్రహీరోల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) ది ప్రత్యేకస్థానం. ఇతర హీరోలు కమర్షియల్ సినిమాలు అంటూ పరుగులు తీస్తూంటే, తాను మాత్రం ప్రేక్షకులు మెచ్చిన సినిమాలు తీస్తూ చెరగని ముద్ర వేస్తున్నాడు. ఇక మల్టీ స్టారర్ సినిమాలు అనగానే మొదట గుర్తుకువచ్చేది కూాడా వెంకటేశ్ (Venkatesh Daggubati) మాత్రమే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అందుకే వెంకీ అందరి హీరో. విక్టరీ వెంకటేష్ బర్త్ డే ఇవాళ. ఆయన బర్త్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ట్వీట్ చేశారు. డియర్ వెంకీ ‘‘హ్యాపీ బర్త్ డే.. వేర్ ఈజ్ ది పార్టీ’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

1960, డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఇవాల్టితో వెంకీ 62వ ఏటా అడుగు పెట్టనున్నారు. ప్రముఖ నిర్మాత కుమారుడిగానే కాకుండ.. నటనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వెంకీ. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు (Tollywood) ప్రవేశం చేశారు. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. ఆతర్వాత కొన్ని పరాజయాల తర్వాత బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ మరోసారి ఫాంలోకి వచ్చాడు. ఆ తర్వాత మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ చెరగని ముద్ర వేస్తున్నాడు.

ఈ స్టార్ (Venkatesh Daggubati) డిసెంబర్13న ‘నారప్ప‘ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్ప (Narappa) థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం అని అన్నారు సురేష్ బాబు (Suresh Babu).

Also Read: Jigarthanda2 Teaser: యాక్ష‌న్ కామెడీ బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’.. అంచనాలు పెంచేసిన టీజర్!