Viswambhara : విశ్వంభర ఆయన రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Megastar Chiranjeevi Viswambhara Business Deals

Megastar Chiranjeevi Viswambhara Business Deals

Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. వీరితో పాటుగా ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభిలు కూడా సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో చిరంజీవికి నలుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో రావు రమేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న రావు రమేష్ ఫైనల్ గా మెగా ఛాన్స్ అందుకున్నాడు. విశ్వంభర సినిమాలో ఆయనది చాలా ప్రత్యేకమైన పాత్ర అని టాక్. రావు గోపాల రావుతో చాలా సినిమాలు చేసిన చిరంజీవి ఆయన కొడుకు రావు రమేష్ తో చేయడం ఇదే మొదటిసారి.

మెగా ఆఫర్ తో రావు రమేష్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. మరి విశ్వంభర సినిమాలో రావు రమేష్ పాత్ర గురించి మంచి హైప్ ఏర్పడగా మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : NBK109 లక్కీ ఛాన్స్ పట్టేసిన తెలుగు అమ్మాయి..!

  Last Updated: 04 Mar 2024, 10:53 PM IST