Megastar Chiranjeevi Viswambhara Overseas Rights : విశ్వంభర టాప్ లేపిన ఓవర్సీస్ రైట్స్.. మెగా మాస్ బీభత్సం ఇది..!

Megastar Chiranjeevi Viswambhara Overseas Rights మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా

Published By: HashtagU Telugu Desk
Megastar Chiranjeevi Viswambhara Link with Mahesh Babu Guntur Karam

Megastar Chiranjeevi Viswambhara Link with Mahesh Babu Guntur Karam

Megastar Chiranjeevi Viswambhara Overseas Rights  మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే రికార్డులు సృష్టిస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

మెగాస్టార్ సినిమా అంటే మామూలుగానే క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటిది బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్ లో సినిమా అనగానే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.

ఈ సినిమా చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ కథతో వస్తుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ చాలా పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఓవర్సీస్ రైట్స్ ధర భారీ రేటు పలికిందని తెలుస్తుంది. చిరు కెరీర్ లో హయ్యెస్ట్ ప్రైజ్ తో విశ్వంభర సినిమా ఓవర్ సీస్ రైట్స్ పలికినట్టు తెలుస్తుంది.

విశ్వంభర సినిమాను ఓవర్సీస్ లో సరిగమ వారు రైట్స్ దక్కించుకున్నారట. ఈ రైట్స్ కోసం ఏకంగా 16 కోట్ల దాకా ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా ఎలాగు భారీ స్థాయిలో ఉంటుందని అదే రేంజ్ కి తగినట్టుగా భారీ రేటు కోట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా అనుష్క నటిస్తుండగా సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు సంబందించిన మిగతా అప్డేట్స్ బయటకు రావాల్సి ఉంది.

Also Read : Meenakshi Chaudhary : ముద్దు సీన్లపై హీరోయిన్ కామెంట్.. అసభ్యకరంగా అనిపించకపోతే..!

  Last Updated: 28 Jan 2024, 04:50 PM IST