Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం ఫై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi - Sitaram : ''ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఐ (ఎం) అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

Published By: HashtagU Telugu Desk
Sitaram Yechury Chiranjeevi

Sitaram Yechury Chiranjeevi

Megastar Chiranjeevi Extends condolences to Sitaram Yechury’s Family : సీపీఎం (CPM) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి (Sitaram Yechury) గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయ‌న శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS Hospital)లో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆయన ఆరోగ్యం విషమంగా మరి తుదిశ్వాస విడిచారు. సీతారాం మరణ వార్త తెలిసి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఆయన గురించి మాట్లాడుకోవడం..ఆయనకు ఎక్కువగా ఇష్టమైనవి..ఇష్టం లేనివి..తదితర వ్యక్తి గత విషయాలు తెలుసుకోవడం , మాట్లాడుకోవడం చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ”ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఐ (ఎం) అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి, శ్రీ ఏచూరి ఎప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు, మొత్తం సీపీఐ (ఎం) సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ప్రజా సేవ, దేశం పట్ల అతని నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండి పోతుంది. గొప్పగా ఫీల్ అవడంతో పాటు మిస్ అవుతుంది” అని రాసుకొచ్చాడు.

Read Also : Delhi Metro: ఢిల్లీ మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై క్యూలో నిల‌బ‌డే ప‌నిలేదు..!

  Last Updated: 13 Sep 2024, 01:39 PM IST