Site icon HashtagU Telugu

Chiranjeevi : నేను ఆ టెస్ట్ చేయించకపోతే క్యాన్సర్ వచ్చేదేమో.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Megastar

Megastar Chiranjeevi comments on Cancer goes viral

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ, సూపర్ హిట్స్ ఇస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇటీవల పలు సినిమా, ప్రైవేట్ ఈవెంట్స్ కి కూడా హాజరవుతున్నారు మెగాస్టార్. అయన సేవా కార్యక్రమాల్లోనూ ముందు ఉంటారని తెలిసిందే. ఆరోగ్యానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే తన బ్లడ్ బ్యాంక్(Blood Bank), ఐ బ్యాంక్(Eye Bank) లతో ఎంతోమంది సపోర్ట్ చేయడమే కాక బయట కూడా పలు ఆరోగ్య సంబంధిత అవగాహనా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నానక్ రామ్ గూడాలోని స్టార్ క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఓపెనింగ్ అనంతరం మాట్లాడుతూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ.. గతంలో నేనూ క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు ఓ ట్రీట్మెంట్ చేశారు. ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోకపోతే నేను క్యాన్సర్ బారిన పడేవాడ్ని. క్యాన్సర్ కి సంబంధిత టెస్టులు చేయించుకున్నాను అని చెప్పుకోడానికి నేను భయపడను. AIG హాస్పిటల్ లో కొలనోస్కోపీ చేయించుకొని బయటపడ్డాను అని తెలిపారు. అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయిస్తాను, అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాను. హైదరాబాద్ క్యాన్సర్ నిర్మూలనకు హబ్ గా తయారవ్వాలి. క్యాన్సర్ పై అవగాహన కోసం నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చిరంజీవి అన్నారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయనకు క్యాన్సర్ వచ్చిందని, ట్రీట్మెంట్ చేయించుకోగా తగ్గిందని వార్తల్లో వచ్చింది.

అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ అయి ఇలా మీడియాలో రావడంతో తాజాగా దానికి క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు చిరంజీవి. తన ట్వీట్ లో.. కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు అని పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవి తన మాటలపై క్లారిటీ ఇచ్చారు.

 

Also Read : 1000cr Heros: కో అంటే కోటి.. ఒక్క సినిమాకే 1000 కోట్లు కొల్లగొడుతున్న హీరోలు వీళ్లే!

Exit mobile version