మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి (Anilravipudi) దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. MEGA 157 గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. స్టార్ హీరోయిన్ నయనతార ఇందులో కథానాయికగా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా, గణేష్, బలగం మురళీధర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అభిమానులు ఈ సినిమాపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మెగాస్టార్ పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ అని, ఆయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ గా ఉండనుందని సమాచారం. చిరంజీవి కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, చిరు డ్రిల్ మాస్టర్ పాత్రలో వినోదాన్ని పంచుతుండడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది.
Hyderabad : హాస్పటల్ కు వచ్చిన రోగిపై వార్డుబాయ్ అత్యాచారం యత్నం
సినిమా బజ్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ ఈసారి చిరంజీవి బర్త్‌డే అయిన ఆగస్టు 22న ఓ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారని సమాచారం. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే డిఫరెంట్ టైటిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం
ఇటీవల ముస్సోరిలో కీలక సీన్లు చిత్రీకరించగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. అన్ని సన్నివేశాలూ పండగ వాతావరణానికి తగినట్లుగా డిజైన్ చేయడంతో ఈ సినిమాను సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ కలగలుపుతో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అవుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. మెగాస్టార్ ఫాలోయింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ కలిస్తే MEGA 157 మరో ఇండస్ట్రీ హిట్ అవడం ఖాయమనే మాటలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.