Site icon HashtagU Telugu

MEGA157 : సెట్స్ లోకి దిగిన చిరంజీవి..రఫ్ ఆడించడం ఖాయం

Chiranjeevi & Anil Ravipudi

Chiranjeevi & Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైనమిక్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anilravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘మెగా 157’ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి లుక్ టెస్ట్ చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యింది. చిరుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ చిరంజీవి అభిమానులలో భారీ అంచనాలను పెంచుతోంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం సభ్యులు పాల్గొననున్నారు. కథానాయికగా నయనతార ఎంపిక కావడం ఈ సినిమాకి మరో హైలైట్‌గా మారింది. ఇటీవలే మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా ఆమెను హీరోయిన్‌గా ప్రకటించారు. చిరంజీవి, నయనతార జోడీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో మాస్, ఎమోషన్, ఎంటర్టైన్‌మెంట్ మేళవించిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రాన్ని పూర్తిచేసి, ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి మూవీ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారని సమాచారం.