Site icon HashtagU Telugu

Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!

Bhola Shankar

Bhola Shankar

టాలీవుడ్ లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే, మరో మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు.. తన పక్కన కుర్ర హీరోలకు అవకాశం ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో ఆకట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో భోళాశంకర్ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది. “భోళా మేనియా త్వరలోనే ప్రారంభం” అంటూ లిరికల్ వీడియోస్ విడుదలను గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్.

ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అంటే, ప్రమోషన్ కు ఇంకా 2 నెలలు టైమ్ ఉందన్నమాట. ఈ క్రమంలో ముందుగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఫస్ట్ సాంగ్ లోనే చిరు మాస్ లుక్ తో పాటు, స్టెప్స్ ను చూపించబోతున్నారు. ఈ మేరకు జాతర/ఉత్సవం బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి స్టయిల్ గా నిల్చున్న ఫొటోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పక్కా మాస్ రోల్ పోషించారు చిరంజీవి. సో.. సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయంటున్నారు. భోళాశంకర్ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఈ మూవీలో తమన్నా చిరు పక్కన హీరోయిన్ నటిస్తుంటే, కీర్తి సురేశ్ చెల్లి పాత్రలో కనిపించబోతోంది.

Also Read: IPL Effect: రెచ్చిపోయిన ప్రేమికులు.. రికార్డుస్థాయిలో కండోమ్స్, బిర్యానీ ఆర్డర్లు!

Exit mobile version