Site icon HashtagU Telugu

Sai Durgha Tej : బ్లడ్ బ్యాంక్‌లో సాయి దుర్గ తేజ్ బర్త్ డే వేడుకలు..

Mega Hero Sai Durgha Tej Birthday Celebrations in Megastar Chiranjeevi Blood Bank

Sai Durgha Tej

Sai Durgha Tej : నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. మెగా మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్. 2021 లో భారీ యాక్సిడెంట్ కు గురైనా కష్టపడి కోలుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత హెల్త్ మీద ఫోకస్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి దుర్గా తేజ్ త్వరలో భారీ పీరియాడిక్ సినిమాతో రాబోతున్నాడు.

నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా SDT18 సినిమా మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇక తేజ్ ఫ్యాన్స్ నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోనే సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రక్తదానం చేసిన అభిమానులతో తేజ్ తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు.

సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేయగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సాయి దుర్గ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి.

 

Also Read : Surya Kanguva : సూర్య కంగువ రన్ టైం.. క్లవర్ డెసిషన్..!