Mega Fans Unsubscribing Aha ఏపీ ఎలక్షన్స్ క్యాపెయింగ్ లో జనసేనకు సపోర్ట్ గా ఒక మెసేజ్ పెట్టి తన స్నేహితుడు వైసీపీ నుంచి నంద్యాలలో పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డికి సపోర్ట్ గా అక్కడకు వెళ్లాడు అల్లు అర్జున్. అప్పటినుంచే మెగా పవర్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత ఓటింగ్ టైం లో పార్టీ పరంగా కాదు తనకు తెలిసిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా తాను సపోర్ట్ చేస్తానని.. పవన్ కళ్యాణ్ గారికి తన సపోర్ట్ ఉంటుందని అన్నారు అల్లు అర్జున్.
ఎలక్షన్స్ తర్వత నాగ బాబు మనవాడు, పరాయివాడు అన్న ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ అల్లు అర్జున్ ని గురించే అని తెలిసిందే. అల్లు ఆర్మీ నుంచి విపరీతమైన ట్రోల్స్ రావడంతో నాగ బాబు ఎక్స్ ని డీ యాక్టివేట్ చేశారు. మళ్లీ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశానని ఎంట్రీ ఇచ్చారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద గుర్రుగా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సమక్షంలో వస్తున్న ఆహా ని అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆహాని అన్ సబ్ స్క్రైబ్ చేయాలంటూ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా హడావిడి చేస్తున్నారు. అంతకుముందు వరకు బాగానే ఉన్నా ఈమధ్య ఓటీటీల పరిస్థితి అంతగా బాగాలేదు.
ఓ పక్క కార్పొరేట్ సంస్థలైన అమేజాన్ ప్రైం వీడియో, నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో వెబ్ సీరీస్, సినిమాలను చేస్తున్నారు. ఆహా ఆ రేంజ్ బడ్జెట్ పెట్టలేక వెనకపడుతుంది. మెగా ఫ్యాన్స్ ఆహాని అన్ సబ్ స్క్రైబ్ చేయడం మొదలు పెడితే అది ఆహాకి మరింత లాస్ తెస్తుందని చెప్పొచ్చు.
Also Read : Anirudh Ravichandran : దేవర సాంగ్.. అనిరుద్ ఇది ఊహించలేదుగా..!