అల్లు అరవింద్ (ALlu Aravind) పై మెగా అభిమానులు (Mega Fans) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ నెలలుగా మెగా ఫ్యాన్స్ అల్లుఅర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ..ఇప్పుడు వారి ఆగ్రహానికి అల్లు అరవింద్ వంతు వచ్చింది. దీనికి కారణంగా తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యలే. ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజును ఎలివేట్ చేయడం కోసం ‘గేమ్ చేంజర్’ సినిమాను పరోక్షంగా ఫ్లాప్‌గా చెప్పడం, ఇప్పుడు రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ (Chirutha) గురించి నెగటివ్ కామెంట్లు చేయడం మెగా ఫ్యాన్స్‌లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
Amaravati : రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. “చిరుత సరిగ్గా ఆడలేదు, బిలో యావరేజ్ మూవీ” అంటూ వ్యాఖ్యానించాడు. అయితే వాస్తవానికి ‘చిరుత’ హిట్ మూవీగానే నిలిచింది. దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్ల వరకు వసూలు చేసి, 40 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం అప్పట్లో రికార్డు.
‘గేమ్ చేంజర్’ విషయంలో ఫ్లాప్ అనే వాదనకు కొంత మేర అర్ధం ఉండొచ్చు, ఎందుకంటే ఆ సినిమా పెట్టుబడి, రాబడుల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కానీ ‘చిరుత’ లాంటి సినిమాను ఫ్లాప్‌గా చెప్పడం కొంత అతిశయోక్తిగా కనిపిస్తోంది. ఇది మెగా అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. అల్లు అరవింద్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక యాదృచ్ఛికంగా ఇలా జరుగుతోందా? అనేది మెగా ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య దూరం పెరుగుతుండగా, అల్లు అరవింద్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరింత చిచ్చు పెడుతోంది.