Site icon HashtagU Telugu

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ తో మెగా అభిమాని భారీ బడ్జెట్ మూవీ

Sudheer New Movie

Sudheer New Movie

బుల్లితెరపై తన వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)ఇప్పుడు వెండి తెరపై కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటికే సూపర్ హిట్స్ అందుకున్న సుధీర్ ..తాజాగా మెగా అభిమాని శివ చెర్రీ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. టీవీ షోల ద్వారా సుధీర్‌కు ఏర్పడిన పాపులారిటీని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నంగా ఈ సినిమా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో వినూత్నమైన కథ, మెరుగైన సాంకేతిక నైపుణ్యం ఉండబోతుందని సమాచారం.

Tulasi Plant: ‎తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!

ఈ నెల 29న రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రానికి ముహూర్తపు పూజ ఘనంగా నిర్వహించనున్నట్లు యూనిట్ తెలిపింది. సినీ పరిశ్రమలో ఈ ముహూర్తం పెద్ద హంగామాగా జరగనుందని, ప్రముఖులు, పెద్ద స్థాయి టెక్నీషియన్లు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని నిర్మాతలు వెల్లడించారు. సుధీర్ కెరీర్‌లో ఇది కీలక మలుపు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

కథ, సాంకేతికత, నటీనటుల పరంగా ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంటుందని యూనిట్ చెబుతోంది. సుధీర్ అభిమానులు ఆయన మొదటి హీరో చిత్రానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బుల్లితెరలో తన ప్రత్యేకమైన శైలి, హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఈ సినిమాతో కొత్త ఇమేజ్ సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.

Exit mobile version