Mega Family Christmas: క్రిస్మస్ సంబరాలను మెగా ఫ్యామిలీ (Mega Family Christmas) ఘనంగా జరుపుకున్నారు. మెగా- అల్లు కుటుంబాల మధ్య సంబంధాలు లేవంటూ నెట్టింట్లో ఎప్పుడూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది. కానీ బన్నీ, చెర్రీ మాత్రం సందర్భం వచ్చినప్పుడు ఫ్యామిలీ పార్టీల్లో కలిసి కనిపిస్తుంటారు. తాజాగా మెగా- అల్లు హీరోలందరూ కలిసి సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Janasena vs YCP : ఆర్జీవీ, రోజా, అంబటిలకు వార్నింగ్ ఇచ్చిన జనసేన వీరమహిళలు
ఈ చిత్రంలో అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్, నిహారిక, పంజా వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అందరూ పార్టీ మోడ్‌లో ఉన్నారు.
Merry Christmas!🎅🏽#familia pic.twitter.com/DQdNXXlMLp
— Varun Tej Konidela (@IAmVarunTej) December 25, 2023
ఈ ఫొటోలో ఎక్కువగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌లే ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరూ పక్కపక్కన నిల్చోని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పోజులు ఇవ్వడంతో ఈ ఫోటో అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫోటోలను ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఉండే ఫోటోలు ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. “బెస్ట్ కజిన్స్. సీక్రెట్ శాంటా నైట్స్” అని రాశారు. వరుణ్ తేజ్ తన పోస్ట్‌కి “మెర్రీ క్రిస్మస్! #ఫ్యామిలియా” అని క్యాప్షన్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.