Mega Celebrations: ఇట్స్ అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం!

రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఎగేంజ్ మెంట్ చేసుకోబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Lavanya And Varun Tej

Lavanya And Varun Tej

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి లు రిలేషన్ లో ఉన్నారని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. రేపు వీరి నిశ్చితార్థం జరగనుంది. అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగబోతోంది. ఈ వేడుకకు మెగా హీరో చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్‌ హాజరై సందడి చేయబోతున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి రెండు చిత్రాలలో కలిసి నటించారు.  మిస్టర్, అంతరిక్షం 9000 KMPH సినిమాల్లో కలిసి నటించడం వల్లే ఇద్దరు ప్రేమలో పడిపోయారు. అయితే  ఈ జంట తమ రిలేషన్ ను రహస్యంగా ఉంచారు. ఒకరి మనుసులు మరొకరు తెలిసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా వీరి ఎగేంజ్ మెంట్ మెగా ఫ్యామిలీలో ఆనందాల్ని నింపనుంది. అయితే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుందనే వార్త చక్కర్లు కొడుతున్న సమయంలోనే మెగా ఇంట్లో మరో వేడుక జరుగబోతుండటం గమనార్హం.

Also Read: Fish Prasadam: ఆస్తమా, ఉబ్బసం రోగులకు గొప్ప వరం.. చేపమందు ప్రసాదం!

  Last Updated: 08 Jun 2023, 12:46 PM IST